ఏబీఎన్‌ ఆఫీసును ముట్టడించిన వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Stages Protest Against ABN Radhakrishna Updates | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ ఆఫీసును ముట్టడించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Apr 7 2026 10:24 AM | Updated on Apr 7 2026 11:08 AM

YSRCP Stages Protest Against ABN Radhakrishna Updates

సాక్షి, హైదరాబాద్‌: ఏబీఎన్‌ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఏబీఎన్‌ ఆఫీసును ముట్టడించింది. ఏబీఎన్‌ ఆఫీస్‌ ఎదుట మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు నిరసనకు దిగారు.

ధర్నాలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్‌, మేరుగ నాగార్జున, లక్ష్మీ పార్వతి, విశ్వరూప్‌, శ్రీకాంత్‌ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, మార్గాని భరత్‌, కారుమూరి, ఇజ్రాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. విలువలు దిగజార్చేలా ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలు ఉన్నాయని చెప్పారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని చెప్పారు. మహిళలకు ఏబీఎన్‌ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘రాధాకృష్ణ అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నాడా? ఏబీఎన్‌ రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఏబీఎన్‌ రాధాకృష్ణది ఒకే అజెండా. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది మీరే. ఏబీఎన్‌ రాధాకృష్ణ రాతలకు మేము భయపడము. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఒక చీటర్‌’ అని అన్నారు.

LIVE : ABN ఆఫీస్ వద్ద టెన్షన్.. టెన్షన్..

 

Advertisement
 
Advertisement
Advertisement