మోదీని పినరయి విజయన్‌ ఫాలో అవుతున్నారు: రేవంత్‌ | Over His Letter To Keralam CM, Telangana CM Revanth Reddy Says He’s Ready To Discuss All Issues And Criticizes Role Model Comparisons | Sakshi
Sakshi News home page

మోదీని పినరయి విజయన్‌ ఫాలో అవుతున్నారు: రేవంత్‌

Apr 7 2026 2:06 PM | Updated on Apr 7 2026 2:19 PM

Over his letter to Keralam CM, Telangana CM A Revanth Reddy says

తిరువనంతపురం: కేరళం అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్లపై కేరళ సీఎం పినరయి విజయన్‌ ఎక్స్‌లో ఘాటుగా సమాధానం చెప్పారు. దీంతో రేవంత్‌ రెడ్డి మళ్లీ స్పందిస్తూ ఆ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ పినరయి విజయన్‌కు ఓ లేఖ రాశారు. ఎక్స్‌లో విజయన్‌ స్పందనను చదివానని.. అందులో తప్పుదారి పట్టించే అంశాలతో పాటు ముఖ్యాంశాల్లో లోపాలు ఉన్నాయని చెప్పారు.

రేవంత్‌ రెడ్డి రాసిన లేఖపై ఇవాళ (ఏప్రిల్‌ 7న) ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. "పినరయి విజయన్‌ ఎప్పుడు సిద్ధంగా ఉన్నా ఆయనతో చర్చకు నేను సిద్ధమే. ఆయనకు రోల్‌ మోడల్స్‌ ఎవరు? నరేంద్ర మోదీ, అమిత్ షా లేదా జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ? నరేంద్ర మోదీని పినరయి విజయన్ రోల్‌ మోడల్‌గా తీసుకున్నారు. ఇది కేరళం ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. అతను ఇంకో నరేంద్ర మోదీలా పినరయి విజయ్‌ ప్రచారం చేస్తున్నారు" అని అన్నారు.

కాగా, తాను అన్ని అంశాలపై చర్చించేందుకు మంగళవారం (ఏప్రిల్‌ 7న) త్రివేండ్రం వస్తానని, అన్ని విషయాలపై గణాంకాలతో సహా చర్చ జరుపుదామని లేఖలో విజయన్‌ను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. పినరయి విజయ్‌ను రేవంత్‌ రెడ్డి మోదీతో పోల్చుతుండడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement