హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ సీఎం రేవంత్ చేసే వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు హరీష్‌రావు. కాంగ్రెస్ మళ్లీ గెలవడం కాదు.. సింగిల్ డిజిట్‌కే పరిమితం అంటూ ఎద్దేవా చేశారు.
ఈరోజు(మంగళవారం, ఏప్రిల్ 7వ తేదీ) పరిగి పర్యటనకు వెళ్తున్న హరీష్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ పీఎస్‌కు తరలించారు. దీనిలో భాగంగా ఆయన్ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్.
‘మీరు మళ్లీ గెలవడం కాదు కదా.. ఈసారి సింగిల్ డిజిటే మీకు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?, పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి పాలన.. గడీల పాలన... బేడీల పాలన గుడ్డి పాలన. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టండి.
ఎస్సీ ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నా భూములను ఎందుకు లాక్కుంటున్నారు. మీ పాలన అంతా బోగస్ మాటలు బోగస్ పాలన. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా?, పరిగిలో భూముల లాక్కొని తన అన్య కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదు?, వచ్చే ఎన్నికల్లో రాబోయే కేసీఆర్ రాజ్యమే’ అని హరీష్ స్పష్టం చేశారు.


