వివస్త్ర ఘటన: జవహార్ నగర్ బాధితురాలికి అండగా మంత్రి మల్లారెడ్డి

Telangana Minister Malla Reddy Good Gesture To Jawahar Nagar Victim - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జవహార్‌ నగర్‌లో జరిగిన దుశ్శాసన పర్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో బాధితురాలికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అండగా నిలిచారు. ఆమెకు పెళ్లి చేయడంతో పాటు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను ఆయనే తీసుకున్నారు.

బాలాజీ నగర్‌లో మద్యం మత్తులో ఓ కీచకుడు ఆమె దుస్తులు చించేసి.. నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చుట్టూ వంద మంది ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయకపోగా.. ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఉదంతంపై బాధితురాలు మీడియా ముందు వాపోయింది కూడా. 

అయితే.. ఈ కేసులో పోలీసులు బాధితురాలికి అండగా నిలవడంతో పాటు నిందితుడ్ని వెంటనే అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఆ బాధితురాలికి మంత్రి మల్లారెడ్డి అండగా నిలబడ్డారు. బాధితురాలికి(28) మున్సిపల్ కార్పోరేషన్‌లో ఉద్యోగం ఇప్పించడంతో పాటు ఆమె పెళ్లి చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. 

అంతేకాదు.. ఆమెకు డబుల్‌ బెడ్రూం ఇవ్వాలంటూ అధికారులకు సైతం మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్‌లోనూ ఆమె యోగక్షేమాలన్నీ తానే చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.

గవర్నర్‌ ఆరా
జవహార్‌ నగర్‌లో మహిళను వివస్త్ర చేసిన ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆరా తీశారు. 

మహిళా కమిషన్‌ సీరియస్‌
జవహార్‌ నగర్‌ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ సైతం సీరియస్‌ అయ్యింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ.. డీజీపీ నుంచి వివరణ కోరింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top