ఎన్నికలుంటే ఇలా.. లేకుంటే అలా!

Telangana: KTR Taunts PM Over Lunch With Workers In Varanasi - Sakshi

కార్మికులతో ప్రధాని లంచ్‌పై ట్విట్టర్‌లో కేటీఆర్‌ వ్యంగ్యస్త్రాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలుంటే ఇలా కూలీలతో కలసి భోజనం.. లేకుంటే అలా వలస కూలీలను గాలికి వదిలేసి ప్రత్యక్ష నరకం చూపెట్టడం..’అని ప్రధాని నరేంద్రమోదీపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వారం కింద ప్రధాని మోదీ తన వారణాసి పర్యటనలో భాగంగా స్థాని క నిర్మాణరంగ కార్మికులతో కలసి మధ్యా హ్న భోజనం చేశారు. లంచ్‌ ఫొటోతోపా టు లాక్‌డౌన్‌ సమయంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వలస కార్మికులు పడిన అగచాట్లకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్‌ ఆదివారం ట్విట్టర్‌లో షేర్‌ చేసి పైన పేర్కొ న్న విధంగా కామెంట్‌ చేశారు.

లక్షలమంది వలసకార్మికులు వందల కిలోమీటర్లు నడిచి స్వగృహాలకు వెళ్లినప్పుడు ఈ ప్రేమ, సహానుభూతి ఎక్కడకు పోయిం ది? అని ప్రశ్నించారు. నిజానికి లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్ల చార్జీల కోసం రాష్ట్ర ప్రభుత్వాలను బలవంతం చేసిందని గుర్తుచేశారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top