వెలుగులోకి ఎమ్మెల్యే పరిటాల సునీత దాష్టీకం | TDP Goons Allegedly Attack YSRCP Activist Kuruba Lingamaiah | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య.. వెలుగులోకి ఎమ్మెల్యే పరిటాల సునీత దాష్టీకం

Mar 30 2025 9:25 PM | Updated on Mar 30 2025 9:25 PM

TDP Goons Allegedly Attack YSRCP Activist Kuruba Lingamaiah

శ్రీసత్యసాయి: పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్యను దారుణంగా హత్య చేశారు. కురుబ లింగమయ్యపై కర్రలు, రాడ్లతో పరిటాల వర్గీయులు దాడి చేశారు. దాడితో అప్రమత్తమైన కుటుంబసబ్యులు లింగమయ్యను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లింగమయ్య మృతి చెందారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులే చంపారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులు
కురుబ లింగమయ్య మృతదేహానికి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎమ్మెల్యే పరిటాల సునీత నైతిక బాధ్యత వహించాలి. పరిటాల సునీత హత్యా రాజకీయాలు చేస్తున్నారు.పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement