న్యాయ‍ వ్యవస్థను మూసేయాలన్న ఉద్ధేశంతోనే..

Sajjala Ramakrishna Reddy Comments On Judiciary In Twitter - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి  ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు.' న్యాయవ్యవస్థపై యుద్ధమా? ఏపీలో న్యాయవ్యవస్థను మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది? అని హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఓ వర్గం మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. కావాలంటే తీర్పులపై అప్పీలుకు వెళ్లండని జడ్జిలు వ్యాఖ్యానించినట్టుగా కూడా పేర్కొన్నాయి. కాకపోతే ఈ వ్యాఖ్యలు వారిచ్చే తీర్పుల్లో ఉంటే అప్పీలుకు వెళ్లి అవి చట్టబద్ధమా? కాదో తేల్చమని పైకోర్టును కోరడానికి అవకాశం ఉంటుంది. (చదవండి : చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి)

న్యాయమూర్తులు విచారణ సందర్భంలో అన్నట్టుగా చెప్తున్న ఈ మాటలేవీ కూడా తీర్పుల్లో లేకపోవడం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించేవారిని ఆందోళన పరుస్తోంది. న్యాయప్రక్రియలో ఇలాంటి కామెంట్లకు చోటు లేనప్పటికీ జడ్జిలు మౌఖికంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ పత్రికలు ప్రభుత్వ వ్యవస్థల ప్రతిష్టలను దెబ్బతీసేలా కథనాలు ప్రచురిస్తున్నాయి. అందుకనే అభిప్రాయాలను మౌఖికంగా కాదు, తీర్పుల ద్వారా చెప్పమని వ్యవస్థలపై గౌరవం ఉన్నవారు చెప్పేమాట.' అంటూ తెలిపారు.(చదవండి : ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తా)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top