చంద్రబాబు, జ‌గ‌న్ మ‌ధ్య‌ తేడా ఇదే: సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu, Sparks Political War Over Women Welfare Promises In AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, జ‌గ‌న్ మ‌ధ్య‌ తేడా ఇదే: సజ్జల

May 31 2026 12:27 PM | Updated on May 31 2026 3:01 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం.. మహానాడు సాక్షిగా చెప్పిన అబద్ధాలపై తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చర్చ జరిగింది. సమావేశానికి వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచకపాలన. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే. వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. చంద్రబాబు మోసం చేసి పుండుమీద కారం చల్లుతున్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడు. చంద్రబాబుకు జగన్‌కు ఎంతో వ్యత్యాసం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలనేది జగన్ ఆలోచన. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బాధ్యతగా జగన్ భావించారు. కానీ చంద్రబాబు ఏం చేయకుండానే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చేశానంటున్నాడు. ఇప్పుడు పిల్లలే సంపద పిల్లల్నికనండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఇంటి నుంచే ఎందుకు మొదలుపెట్టరు. నెలకు 1500 ఆడబిడ్డ నిధి హామీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ముగ్గుర్ని కంటే రూ.30 వేలు నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటున్నాడు. మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన ఒక ఉదాహరణ

..రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌.. చంద్రబాబుకు గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధిచేయగల శక్తి జగన్‌కే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం వివరించాలి. ఆడబిడ్డ నిధి ఇస్తామని చంద్రబాబు చేసిన అతిపెద్ద మోసం. చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి. మా హామీల సంగతి ఏంటని చంద్రబాబు,లోకేష్,పవన్‌ను ఎక్కడ కనబడినా అడగాలి’’ అని సజ్జల పిలుపునిచ్చారు.

అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం: వరుదు కల్యాణి
వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు పాలన అంతా మోసం దగా. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామాలు పెట్టారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు చీటింగా మాస్టర్. మొన్న జరిగింది హైబ్రీడ్ మహానాడు కాదు లోగ్రేడ్ మహానాడు. తల్లికి, చెల్లికి మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మహానాడులో వైఎస్‌ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలకు వైఎస్‌ జగన్‌ ఎదురుగా నిలబడే ధైర్యం ఉందా?.

..టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ బోత్ ఆర్ నాట్ సేమ్. తెలుగువారి పౌరుషాన్ని జగన్ ఢిల్లీకి చూపించారు. తెలుగువారి ప్రయోజనాలను ఢిల్లీకి చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్‌ జగన్‌. హామీలను ఎగ్గొట్టిన మోసగాడు చంద్రబాబు. మా బ్రాండ్ సంక్షేమం.. మీ బ్రాండ్ సంక్షోభం. హోంమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం కూడా మీలా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. జైల్లో ఖైదీలతో కుమ్మక్కైన మీకు వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్రాన్ని మద్యం, గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. హోంమంత్రి అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం. వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన అభివృద్ధి మీకు వివరిస్తాం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement