బహుశా ఆ మొదటి వ్యక్తిని నేనేనేమో!.. సర్కారే ఫోన్‌ట్యాప్‌ చేస్తే ఏం చేయగలం?

Rahul Gandhi Speech At Stanford University And Silicon Valley - Sakshi

2004లో నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆ సమయంలో భారత్‌ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి.. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ చెప్పిన మాటలివి. 

ఎంపీగా తనపై పడిన అనర్హత వేటు గురించి విదేశీ గడ్డపైనా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. భారత్‌లో పరువు నష్టం కేసులో ఇలాంటి శిక్షను ఎదుర్కొన్న నేతను బహుశా తానేనేమోనని వ్యాఖ్యానించారాయన. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో.. దేశం ఇలా అయిపోతుందని ఊహించలేదు. పరువు నష్టం దావాతో గరిష్ట శిక్షను ఎదుర్కొన్న మొదటి నేతను బహుశా నేనే కావొచ్చు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని పేర్కొన్నారాయన. 

52 ఏళ్ల రాహుల్‌ గాంధీ ఇప్పటివరకు నాలుగుసార్లు ఎంపీగా నెగ్గారు. అయితే.. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల గరిష్ట శిక్ష పడగా, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం అనర్హత వేటు పడి ఎంపీ(వయనాడ్‌ లోక్‌సభ స్థానం) పదవిని కోల్పోయారాయన. అయితే పార్లమెంట్‌లో కూర్చొని గళం వినిపించడంతో పోలిస్తే ఇప్పుడు తనకు మరింత అవకాశం దొరికిందని చెబుతూ.. భారత్‌ జోడో పాదయాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. 

హలో.. మిస్టర్‌ మోదీ
తన పర్యటనలో భాగంగా.. సిలికాన్‌ వ్యాలీలో సందడి చేసిన రాహుల్‌ గాంధీ, పలువురు స్టార్టప్‌ ఎంటర్‌ప్రెన్యూర్లతో కాసేపు రాహుల్‌ గాంధీ ముచ్చటించారు. వాళ్ల మధ్య ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల గురించి చిట్‌చాట్‌ జరిగింది.  ఈ క్రమంలో.. భారత్‌లో టెక్నాలజీ విస్తరణ గురించి ప్రస్తావనకు రాగా.. పెగాసస్‌ కుంభకోణం అంశం లేవనెత్తారు రాహుల్‌ గాంధీ. 

దాని గురించి(ఫోన్‌ ట్యాపింగ్‌) నేనేం దిగులుచెందడం లేదు. ఒకానొక టైంలో నా ఫోన్‌ట్యాపింగ్‌ అవుతోందని నాకు అర్థమైంది. అంటూ.. తన ఐఫోన్‌లో ‘‘హలో మిస్టర్‌ మోదీ’’ అంటూ ఛలోక్తి విసిరారాయన. ఒక ప్రభుత్వమే ఫోన్‌లు ట్యాప్‌ చేయాలని అనుకుంటే.. దానిని ఎవరూ ఆపలేరు కదా. అది పోరాటం చేయదగ్గ అంశమూ కాలేదు. ఎందుకంటే.. చేసే ప్రతీ పని ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి..  అని రాహుల్‌ పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: దేశ మనోభావాల్ని కించపరిచారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top