
ఢిల్లీ : బీఆర్‌ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, అదే సమయంలో జనాల్లోకి కూడా వెళ్లడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజ(శక్రవారం, జూలై 11వ తేదీ) ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న మల్లు.. తమ ప్రభుత్వంలో అంతా కలిసికట్టగా పనిచేస్తన్నారని, ఇక్కడ పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని మల్లు తెలిపారు. అందరం కలిసి టీమ్ వర్క్‌గా పనిచేస్తన్నామన్నారు.
‘రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది విధాన నిర్ణయం. రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణ మాఫీ. సన్నం బియ్యం సక్సెస్ అయ్యింది. మహిళలకు ఉచిత బస్సుకు మంచి స్పందన ఉంది. ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయి. మూసి సుందరీకరణ ఈ ప్రభుత్వం హయంలో పూర్తి అవుతుంది.
రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదు. సిగాచి ప్రమాదం పై విచారణ కు ఆదేశించాము. ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే,కేసి వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉంది’ అని మల్లు తెలిపారు.