కాంగ్రెస్‌లో జోష్‌.. వరంగల్‌ దండోరా సభకు రాహుల్‌ గాంధీ

Rahul Gandhi to Attend Congress Meet in Warangal On September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్ రెండో వారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.‌ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా చివరి సభ వరంగల్‌లో నిర్వహించనున్నట్లు, ఆ సభకు రాహుల్ గాంధీ వస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌  రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్, సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశంలో దళిత గిరిజన దండోరా, పార్టీ పనితీరుపై చర్చించారు. సెప్టెంబర్ 10 నుంచి 17 మద్య దండోరా సభ వరంగల్‌లో నిర్వహించాలని, దానికి  రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా 72 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని,  ఎవరు ఆపలేరని రేవంత్ స్పష్టం చేశారు. యూత్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ, ఎస్టీ విభాగాల నుంచి 119 ఇంఛార్జీలను  నియమించుకోవాలని సూచించారు.‌ ఇంద్రవెల్లి, రావిర్యాల సభలను కార్యకర్తలు విజయం చేశారని, దాని వల్ల పార్టీ చాలా బలోపేతం అయ్యిందన్నారు.‌ సెప్టెంబర్ 10 నుంచి 17 లోపు తెలంగాణ లో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని ప్రకటించారు. 

కాగా బుధశారం రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల వేదికగా జరిగి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మహాసభకు జనం భారీగా తరలివచ్చారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్నప్పటికీ కార్యకర్తలు కదలకుండా అలాగే ఉండిపోయారు. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో నిన్నటి వరకు నిస్తేజంగా ఉన్న ఆ పార్టీ కేడర్‌లో ఒక్కసారిగా నూతనోత్సాహం కనిపించింది. వర్షంలోనే రేవంత్‌రెడ్డి స్వీచ్‌ ఇవ్వడం.. ప్రముఖు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top