
వైఎస్సార్‌జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా మెట్‌నూతనపల్లి గ్రామస్థులకు ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది. మెట్‌నూతనపల్లిలో పచ్చకాలకేయులు దొంగ ఓట్లను వేస్తున్నారు. టీడీపీ మూకలు దౌర్జన్యంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు భయభ్రాంతులకు గురౌవుతున్నారు.
తమ ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదని, బయట వ్యక్తులు వందలాది మంది తిష్టవేసి తమ ఓట్లను వేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటర్ ప్లిప్‌లను తీసుకుని తరిమేశారంటూ మీడియాకు చెప్పుకొచ్చారు. అక్కడ తమను ఓటు వేయకుండా ఆడ్డుకోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోతున్నామన్నారు. మరికొన్ని చోట్ల వేలికి ఇంక్ పూసి ఓటు వేసేశారు వెళ్లిపోండి అంటున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ఆఫీస్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
కూటమి ప్రభుత్వానికి పోలీసులు అండగా ఉన్నారనే విషయం మరోసారి నిరూపితమైంది. పులివెందుల వైఎస్సార్‌సీపీ ఆఫీస్ గేట్లను మూసివేశారు. వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌లోకి వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో కార్యాలయానికి తాళం వేశారు. దాంతో వైఎస్సార్‌సీపీ ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిళలపై సైతం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు.
