జాంబవంతుడి శోభ.. అజరామరం | - | Sakshi
Sakshi News home page

జాంబవంతుడి శోభ.. అజరామరం

Dec 10 2025 7:42 AM | Updated on Dec 10 2025 7:42 AM

జాంబవ

జాంబవంతుడి శోభ.. అజరామరం

జాంబవంతుడి శోభ.. అజరామరం ఆధ్యాత్మిక క్షేత్రంగా..

పెరుగుతున్న యాత్రికుల అంచనాతో..

ప్రణాళికలో..

రాజంపేట: ఆంధ్రా అయోధ్యగా వెలుగొందుతున్న ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. రామాలయం అత్యంత సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో ఏర్పాటు చేసేందుకు టీటీడీ తన మాస్టర్‌ప్లాన్‌లో తీసుకువచ్చింది. పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో 600 జయంత్యుత్సవాల సందర్భంగా 108 అడుగుల అన్నమయ్య విగ్రహం రాజంపేటకే ల్యాండ్‌మార్క్‌గా మారింది. అదే తరహాలో ఏకశిలానగరంలోని చెరువులో జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేస్తే.. అదే భవిష్యత్తులో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారనున్నది. ఇప్పటికే దాశరథి కల్యాణ మండపం సమీపంలో నామమాత్రంగా జాంబవుంతుడి విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

చెరువులోనే ఎందుకు?

పురాణ, ఇతిహాసాల చరిత్ర ఆధారంగా ఒంటమిట్ట వద్ద జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది. రామాయణం, భాగవతం కథనాల ప్రకారం జాంబవంతుడు.. బ్రహ్మదేవుడి ఆవలింత నుంచి పుట్టిన యోధుడు భల్లూకరాజుగా గుర్తింపు ఉంది. రామాయణంలో కూడా శ్రీరాముడితో కలిసి లంక యుద్ధంలో పోరాడిన జాంబవంతుడు శక్తియుక్తులు చాటారు. హనుమంతుడి శక్తిని గుర్తు చేసి, సీతాదేవిని వెతకడానికి ప్రేరేపించిన మహాబలశాలి మాత్రమే కాకుండా, వివేకవంతుడని ప్రస్తావించారు. శ్రీ కృష్ణుడికి శమంతకమణి ఇవ్వడంతోపాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఇచ్చి వివాహం చేశాడట. కృతయుగం నుంచి ద్వాపరయుగం వరకు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం ఈ ఏకశిల విగ్రహాలను జాంబవంతుడు ప్రతిష్టించారని ఒక కథనం. అందుకే ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కోవెలకు ల్యాడ్‌మార్క్‌గా జాంబవంతుడి 108 అడుగుల విగ్రహం నిలవనున్నదనే భక్తుల మనోగతం.

50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని...

రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమిని అధికారిక పండుగగా నిర్వహించే ఏకశిలానగరం ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి కేంద్రీకృతం చేసింది. 50 ఏళ్లను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆ దిశగా మాస్టర్‌ప్లాన్‌ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మ్యూజియం: భక్తుల కోసం కల్యాణ కట్ట, పుష్కరిణి, నక్షత్రవనాలు, గార్డెనింగ్‌, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామస్వామి ప్రాశస్త్యం నవతరానికి అందించేలా మ్యూజియం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్‌ స్క్రీన్స్‌, హనుమంతుడి సేవానిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్‌, తోరణాలు లాంటివి ఏర్పాటు చేయనున్నారు.

ఏకశిలానగరంలోని ఒంటిమిట్ట చెరువు (ఇన్‌సెట్‌) జాంబవంతుడు ప్రతిష్టించిన ఏకశిల విగ్రహామూర్తులు

పెరిగే యాత్రికుల సంఖ్యను అంచనా వేసి, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా సదుపాయాలు, వసతి రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళిక ఉండాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచనలు అందాయి. నిత్యఅన్నదాన పథకం అమలు చేయడానికి వీలుగా అన్నదానసత్రం, వసతుల కోసం రూ.4.35 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారు.

మాడవీధులు, రథశాల, పుష్కరిణి, సంజీవరాయస్వామి ఆలయం, మాలఓబన్న స్థూపం, శృంగిశైలం, సత్రపాళెం, కొండ, రామలక్ష్మణ తీర్థాలు, కల్యాణ వేదిక ప్రాంతాల అభివృద్ధి, సుందరీకరణకు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 23న ఆర్కిటెక్చర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌ బృందం ఒంటిమిట్టను పరిశీలించిన సంగతి విదితమే.

ఒంటమిట్ట చెరువులో 108 అడుగుల విగ్రహం

ఏకశిలానగరికి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌

50 ఏళ్ల లక్ష్యంగాఅభివృద్ధి దిశగా టీటీడీ అడుగులు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లనున్నది. కడప–తిరుపతి మార్గంలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలవనున్నది. ఒంటిమిట్ట చెరువు జాతీయ రహదారి పక్కనే రామాలయం ఉంది. రహదారి మరో పక్క జిల్లాలోనే అతిపెద్ద చెరువు ఉంది. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం శ్రీ కోదండరామాలయం ప్రభుత్వ అధికారిక రామాలయంగా మారింది. శ్రీరామనవమి ఉత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురావడం సంప్రదాయంగా పాటిస్తున్నారు.

జాంబవంతుడి శోభ.. అజరామరం 1
1/3

జాంబవంతుడి శోభ.. అజరామరం

జాంబవంతుడి శోభ.. అజరామరం 2
2/3

జాంబవంతుడి శోభ.. అజరామరం

జాంబవంతుడి శోభ.. అజరామరం 3
3/3

జాంబవంతుడి శోభ.. అజరామరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement