మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ
కడప కార్పొరేషన్: కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 11వ తేది మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వాటిని మాజీ మేయర్ కె. సురేష్ బాబు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. తాను వేసిన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకమునుపే మేయర్ ఎన్నిక నిర్వహించడం సరికాదంటూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై ఈనెల 9వ తేది విచారణ జరుపుతామని ప్రకటించిన న్యాయస్థానం...ఆ మేరకు విచారణ జరిపింది. ఈనెల 10వతేది ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పును బట్టే 11వ తేది మేయర్ ఎన్నిక ఉంటుందా ...లేదా అన్నది ఆధారపడి ఉంది.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని మున్సిపల్ మైదానంలో బుధవారం జిల్లా స్థాయి సీనియర్ పురుషులు, మహిళలకు జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, విజయ్ భాస్కర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు వారి ఽఆధార్ కార్డు, ఆటకు సంబంధించిన పరికరాలు తీసుకొని రావాలన్నారు. అభ్యర్థుల వయస్సు సీనియర్ పురుషులు 19 సంవత్సరాలు, యూత్ మహిళలు 17 సంవత్సరాలు , సీనియర్ మహిళలు 19 సంవత్సరాల వయస్సు ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు పురుషులకు ఈ నెల 13 నుంచి 14 వరకు విజయవాడలో, 20 నుంచి 21 వరకు యూత్ మహిళలకు, సీనియర్ మహిళలకు పిఠాపురంలో ఉంటాయన్నారు.
కడప అగ్రికల్చర్: ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా మేనేజర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. కడపలోని జిల్లా సమాఖ్యలో మంగళవారం కడప జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి రబీ సాగుపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి రైతు సాధికార సంస్థ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేసుకోవాలని సూచించారు. రైతులకు ఆదాయంతో పాటు ఆరోగ్యం, భూమి సారవంతం అయి సాగు ఖర్చు తగ్గి దిగుబడి బాగా వస్తుందన్నారు. ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అన్ని విషయాలను బాగా నేర్చుకొని అందరూ మార్కెటింగ్ కూడా చేసుకోవాలని తెలియజేసారు. ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ట్రైనర్స్ పాల్గొన్నారు.
మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ


