ప్రార్థన సమయానికి ముందే ఉపాధ్యాయులు హాజరు కావాలి
డీఈఓ షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్: ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల ప్రార్థన సమయాని కంటే ముందే పాఠశాలలో ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం కడప నగరం జయనగర్‌కాలనీలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, నగర పాలక ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాల, నగరపాలక ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రార్థన సమయానికి హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ముఖ హాజరు వేయాలని ఆదేశించారు. సమయపాలన లేని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అందజేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. అనంతరం పది 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను జిల్లాలోని ప్రతి పాఠశాల తప్పనిసరిగా అమలు చేయాలసి సూచించారు. సబ్జెక్టుల వారిగా కేటాయించిన ఉపాధ్యాయులు తమ సబ్జెక్టు వారి యాక్షన్ ప్లాన్‌లో పాల్గొనాలని తెలిపారు. 100 రోజులు యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి పాఠశాల వందశాతం రిజల్ట్ వచ్చే విధంగా ప్రతి ఉపాధ్యాయులు పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయులు భాగ్యవతి, విజయలక్ష్మి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మునీర, సీఆర్‌ఎంటి ఆదిమూలం శంకర్, కృష్ణ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


