న్యాయమూర్తులతో ముందస్తు జాతీయ లోక్ అదాలత్ సమావేశం
కడప అర్బన్ : ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని ఆధ్వర్యంలో మంగళవారం ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్ కుమార్, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దీన బాబు, ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, కడప ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూష కుమారి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్. బాబా ఫకృద్దీన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భార్గవి, మొబైల్ కోర్టు జడ్జి ఆశ ప్రియ, మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి, కడప ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రేష్మ పాల్గొన్నారు.


