అభివృద్ధికి విశేష కృషి
ఏకశిలానగరాభివృద్ధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మార్క్ బాగా కనిపిస్తుందని రామభక్తుల మనోగతం. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అధికారిక రామాలయంగా ప్రకటించారు. టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ తొలినాళ్లలో రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధికి టీటీడీ తరఫున అడుగులు వేశారు. ఆనాటి మాస్టర్‌ప్లాన్‌తో ఇప్పటి రామాలయం శోభ సాక్షాత్కరిస్తుంది. మళ్లీ ఆయనే టీటీడీ ఈవోగా రావడంతో 50 ఏళ్లను ముందుగానే దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా పాలకమండలి సహకారంతో నిర్ణయాలు టీటీడీ తీసుకునేలా, అధికారులను సమాయత్తం చేశారు. ఇప్పుడు ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుడివిగ్రహం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవడానికి ఈవో కారకులయ్యారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


