జిల్లాలో స్మార్ట్ కిచెన్ షెడ్స్ పూర్తి చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్ గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ భవన నిర్మాణాల పురోగతిపై.. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేపట్టామని, ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల స్మార్ట్ కిచెన్ లద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు.
జిల్లాలో నూతనంగా 33 స్మార్ట్ కిచెన్ షెడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు.. ఇప్పటికే ఆయా మండలాల్లో నిర్మాణ పనులు ప్రారంభం అయి వివిధ దశల్లో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇందులో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. స్మార్ట్ కిచెన్ లో ఏర్పాటు చేసే పరికరాల కోసం టెండర్, కొనుగోలు, ఆయా పాఠశాలలకు ఫుడ్ ట్రాన్స్ పోర్టేషన్ కు అవసరమైన వాహనాలు మొదలైన అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో సీపీఓ హజరతయ్య, డీఈఓ షంషుద్దిన్, స్మార్ట్ కిచెన్ల పపర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్‌ఈ మద్దన్న, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు, సమగ్ర శిక్ష ఏపీసీ ప్రేమంత్ కుమార్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణ, డీఏఓ చంద్రా నాయక్, డీహెచ్ ఓ సతీష్ కుమార్, డీసీఓ వెంకట సుబ్బయ్య, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


