breaking news
vontimetta
-
‘ఓటరు స్లిప్ తీసుకుని మమ్మల్ని తరిమేశారు’
వైఎస్సార్‌జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా మెట్‌నూతనపల్లి గ్రామస్థులకు ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది. మెట్‌నూతనపల్లిలో పచ్చకాలకేయులు దొంగ ఓట్లను వేస్తున్నారు. టీడీపీ మూకలు దౌర్జన్యంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. తమ ఊర్లో ఓటు వేసే పరిస్థితి లేదని, బయట వ్యక్తులు వందలాది మంది తిష్టవేసి తమ ఓట్లను వేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓటర్ ప్లిప్‌లను తీసుకుని తరిమేశారంటూ మీడియాకు చెప్పుకొచ్చారు. అక్కడ తమను ఓటు వేయకుండా ఆడ్డుకోవడంతో చేసేది లేక వెనక్కి వెళ్లిపోతున్నామన్నారు. మరికొన్ని చోట్ల వేలికి ఇంక్ పూసి ఓటు వేసేశారు వెళ్లిపోండి అంటున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్ద పోలీసుల ఓవరాక్షన్కూటమి ప్రభుత్వానికి పోలీసులు అండగా ఉన్నారనే విషయం మరోసారి నిరూపితమైంది. పులివెందుల వైఎస్సార్సీపీ ఆఫీస్ గేట్లను మూసివేశారు. వైఎస్సార్సీపీ ఆఫీస్‌లోకి వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో కార్యాలయానికి తాళం వేశారు. దాంతో వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిళలపై సైతం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. -
చంద్రబాబు వాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు
-
పోతన రామాయణం రాశారు: చంద్రబాబు
సాక్షి, కడప: బమ్మెర పోతన మహాకవి తెలుగువారందరికీ సుపరిచితులు. ఆయన రచించిన ‘శ్రీమదాంధ్ర భాగవతం’లోని పద్యాలు, కీర్తనలు తెలుగువారికి కంఠతా వస్తాయి. ఇప్పటికీ తేనెలొలుకు ఆ తెలుగు పద్యాలు తెలుగువారి నోట జాలువారుతుంటాయి. అలాంటి బమ్మెర పోతన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు జారారు. వైఎస్ఆర్ జిల్లా ఒంట్టిమిట్టలో బమ్మెర పోతన రామాయణం రాసి.. అక్కడి కోదండరామస్వామికి అంకితమిచ్చేశారని అనేశారు. ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘కోదండరామస్వామి దేవాలయం.. ఒక చరిత్ర కలిగిన దేవాలయం. ఒక చరిత్ర ఉండే దేవాలయం ఇది. ఆ చరిత్రను ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోని ఈ టెంపుల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఆ రోజు బమ్మెర పోతన ఇక్కడనే రామాయణం రాసి.. ఈ దేవునికి అంకితం చేసిన విషయం కూడా మనమందరం గుర్తుపెట్టుకోవాలి’ అని చెప్పుకొచ్చారు. అయితే, చంద్రబాబు బమ్మెర పోతన విషయమై చేసిన వ్యాఖ్యలపై తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహిత్యవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బమ్మెర పోతన ‘వీరభద్ర విజయము’, ‘భోగినీ దండకము’, ‘భాగవతము’, ‘నారాయణ శతకము’ వంటి రచనలు చేశారు. ఆయన రామాయణాన్ని రచించలేదు. ఈ నేపథ్యంలో భాగవతం రాసిన పోతనను రామాయణం రాశారని చంద్రబాబు పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. ఇది చంద్రబాబుకు ఉన్న జ్ఞానం అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. (వీడియో టీటీడీ సౌజన్యంతో) -
వటపత్రశాయి అలంకారంలో కోదండరాముడు
ఒంటిమిట్ట(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో ఆదివారం ఉదయం కోదండరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కోదండరాముడు రోజుకో అవతారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తున్నాడు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.