వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు: పొంగులేటి

Ponguleti Srinivasa Reddy Comments on Contesting in Elections - Sakshi

సాక్షి, మధిర: తెలంగాణలో ముందుగా వచ్చే ఏ ఎన్నికలోనైనా తప్పనిసరిగా పోటీ చేస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన పలువురి కుటుంబాలను పరామర్శించారు. ఆ తర్వాత మధిరలో టీఆర్‌ఎస్‌ నాయకుడు కోట రాంబాబు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి తాను అధికార పార్టీలోనే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. 

అయితే, అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా మొదట ఎన్నికల్లో పోటీచేస్తే జిల్లా ప్రజలు దీవించారని పొంగులేటి గుర్తు చేశారు. ఆ తర్వాత తాను పార్టీ మారతానని అనుకోలేదని, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మారాల్సి వచ్చిందన్నారు. అలాగే రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చని పొంగులేటి వ్యాఖ్యానించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పిడమర్తి రవి, బొమ్మెర రామ్మూర్తి, వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. (క్లిక్‌: ఎన్టీఆర్‌ డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్‌.. అసెంబ్లీలో మెరుపులే!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top