
అమరావతి: చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆయన తనయుడు నారా లోకేష్ ఇచ్చిన ‘మోత మోగించండి’ కార్యక్రమం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఢిల్లీలో ఉండి లోకేష్ ఇచ్చిన పిలుపును అటు టీడీపీ నాయకులు, ఇటు ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడికి మద్దతుగా కంచాలు, గరిటెలు తీసుకుని నిరసన తెలపాలంటూ ఏపీ ప్రజలకు సూచించారు నారా లోకేష్. చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దామంటూ లోకేష్ ఏదో ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. సాయంత్రం గం.7.00లకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలని లోకేష్ సూచనను అంతా లైట్‌గా తీసుకున్నారు. ప్రజల నుంచి కనీసం ఎటువంటి స్పందనా రాలేదు. ఆ సమయానికి ప్రజలు ఎవరూ కూడా బయటకు రాలేదు... ఎక్కడా కూడా కంచాలు, గరిటెల సౌండ్ వినబడలేదు. ఈ కార్యక్రమాన్ని నందమూరి కుటుంబం దూరంగా ఉండటం గమనార్హం.
కార్యకర్తలైతే ఈ కార్యక్రమాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇక సాధారణ జనం మాత్రం ఇదేం కార్యక్రమం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. పలువురు టీడీపీ నేతలు అయితే లోకేష్ ఇచ్చిన మోత మోగింపు పిలుపును నాన్సెన్‌గా కొట్టేపారేస్తున్నారు.