నెల్లూరు జిల్లా: టీడీపీ అరాచకాలు.. ఎస్పీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | Nellore District YSRCP Leaders Complain To SP About TDP Attacks | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లా: టీడీపీ అరాచకాలు.. ఎస్పీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Jun 24 2024 8:10 PM | Updated on Jun 24 2024 9:02 PM

Nellore District Ysrcp Leaders Complain To Sp About Tdp Attacks

నెల్లూరు జిల్లా ఎస్పీని వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలు, దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా ఎస్పీని వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలు, దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేశామని కాకాణి తెలిపారు.

మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని.. ఆయన సానుకూలంగా స్పందించారని ఆదాల తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement