Nadendla Bhaskara Rao Serious Comments Chandrababu Naidu, Remembers Senior NTR - Sakshi
Sakshi News home page

తినటానికి భోజనం కూడా లేదని ఎన్టీఆర్‌ ఏడ్చారు: నాదెండ్ల భాస్కర్‌ రావు

Nov 20 2021 7:42 PM | Updated on Nov 21 2021 12:37 PM

Nadendla Bhaskara Rao Serious Comments Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబు భార్యను ఏమి అనలేదని మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ రాజకీయవేత్త నాదెండ్ల భాస్కరరావు అన్నారు. గతంలో టీడీపీలో చేరేందుకు చంద్రబాబు తన భార్య ద్వారా ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చాడని గుర్తు చేశారు. కూతురు కోసం ఎన్టీఆర్‌ చంద్రబాబును పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్‌ చెక్కులు పాస్‌కాకుండా చంద్రబాబు చేశాడని విమర్శించారు. తనను అందరూ మోసం చేశారని ఎన్టీఆర్‌ ఏడ్చారని గుర్తు చేశారు.
చదవండి: ‘చంద్రబాబు సతీమణి గురించి సభలో ఎక్కడా ప్రస్తావన రాలేదు’

చంద్రబాబు వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని నాదెండ్ల అన్నారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ‘ఎన్టీఆర్‌కు తన పిల్లలు అన్నం కూడా పెట్టలేదు. తినడానికి భోజనం కూడా లేదని ఎన్టీఆర్‌ ఏడ్చారు. ఎన్టీఆర్‌ 20 లక్షల రూపాయలను చంద్రబాబు లాక్కున్నాడు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోవద్దని ఎన్టీఆర్‌కు చెప్పాను. పార్టీలో చేరేందుకు చంద్రబాబు నా దగ్గరకు వచ్చాడు. ఎన్టీఆర్‌ను కూడా చంద్రబాబు దుర్భాషలాడాడు.’ అని నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు.
చదవండి: ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. బాబు మాటలు నమ్మొద్దు: లక్ష్మీ పార్వతి

Advertisement
 
Advertisement
Advertisement