కేంద్రం ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి?

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు అందుబాటులో లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలో వెంటిలేటర్ల సౌకర్యం కల్పించే బాధ్యతను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లాలో దాతలు వెంటిలేటర్లు ఇస్తానన్న ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చడం ఇష్టం లేకపోతే కోవిడ్-19 పేరుతో చికిత్స అందించాలి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్రం కితాబిచ్చిందని చెప్పుకుంటున్నారు. ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి? హైదరాబాద్ సిటీ- అర్బన్ ప్రాంతంలో రోజుకూలీ చేసుకునే వారి కోసం ప్రత్యేక పథకం తీసుకురావాలి. కేంద్ర నిబంధనలు పాటించాలని పోరాటం చేస్తున్నాం’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
(తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర బృందం ప్రశంసలు)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి