తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర బృందం ప్రశంసలు

Corona: Central Team Praised Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో తీసుకుంటున్న వినూత్న చర్యలను కేంద్ర బృందం అభినందించింది.  రాష్ట్ర ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్ పేషేంట్‌ల కోసం రూపొందించిన ‘హితం’ యాప్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని పేర్కొంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కరోనా కట్టడికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో బిఆర్కే భవన్‌లో సమావేశం అయింది. (కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: జేపీ నడ్డా)

ఇన్నోవేటివ్ హితం యాప్ ఇతర రాష్ట్రాలతో పంచుకోవాల్సిందిగా కేంద్ర బృందం, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి కోవిడ్-19 టెస్ట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కరోనా తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేప్పట్టాల్సిన పలు అంశాలపై వీకే పాల్ చర్చించారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు సిద్ధమైన విధానం, వ్యాప్తిని అరికట్టే చర్యలు పేషేంట్‌లకు అందిస్తున్న చికిత్స చర్యలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. (50 మందితో స్వాతంత్ర్య వేడుక‌లు)

మొదటి నుంచి కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తున్నామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రజల ప్రాణాలు రక్షించండానికి 24 గంటల పాటు శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కరోనా పరీక్షలు, చికిత్సలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ నివారణ చర్యలపై సూచనలు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మాద్యే జరిగిందని, క్యాబినెట్ సమావేశంలో రోజుకు 40 వేల పరిక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. కోవిడ్ కట్టడికి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశంలో కేంద్ర బృందానికి తెలిపారు. (తెలంగాణలో ‘సెట్స్‌’  తేదీలు ఖరారు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top