బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ: మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav Comments On BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనైతిక పొత్తులతో ప్రభుత్వాలను పడగొట్టే పనిలో బీజేపీ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. శనివారం.. ప్రధానికి స్వాగతం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికానన్నారు. సీఎం తప్పనిసరిగా స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు.
చదవండి: విశాల భారత పరిరక్షణ కోసమే మా పోరాటం: యశ్వంత్‌ సిన్హా 

గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్‌ స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించిందన్నారు. బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్‌ అభివృద్ధి చూడాలన్నారు. దేశ అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రంలో బీజేపీ సిద్ధమైతే మేమూ రెడీ అంటూ తలసాని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top