చిత్తూరులో పుట్టి సొంత జిల్లాకు ద్రోహం చేసిన చరిత్ర బాబుది: మంత్రి రోజా

Minister Roja Aggreasive Comments On Chandrababu At Tirumala - Sakshi

సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ద్రోహి అని పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో ఉన్న ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని 2003లో మూయించిన చరిత్ర బాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించారని పేర్కొన్నారు. ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌గా  అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నేడు రూ. 21.36 కోట్లు షుగర్‌ ఫ్యాక్టరీ బకాయిలను సీఎం చెల్లించారని తెలిపారు.

ఈ మేరకు షుగర్‌ ఫ్యాక్టరీ ఉద్యోగులకు మంత్రి రోజా, ఎమ్మెల్యే బియ్యపు మధు సుధన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో 165 మంది ఉద్యోగులకు రూ. 9.58 కోట్లు, నగరి నియోజవర్గంలో 147 మంది ఉద్యోగులకు రూ. 8.50 కోట్లు, తిరుపతి నియోజకవర్గంలో 40 మంది ఉద్యోగులకు 2.60 కోట్లు, ఇతర ప్రాంతాలకుచ ఎందిన ఉద్యోగులకు రూ. 58 లక్షల చెక్కులను అందించారు. కన్సాలిడేెడ్ ఉద్యోగుల సమస్యలలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు.
చదవండి: పచ్చ మీడియాకు ఆ దమ్ముందా?: మంత్రి కాకాణి

చిత్తూరు విజయాడెయిరీని మూయించిన చంద్రబాబు.. చిత్తూరు జిల్లాకు, రాష్ట్రానికి చేసింది శూన్యమని మంత్రి రోజా అన్నారు. పుంగనూరు తరహా ఘటనను భీమవరంలో రిపీట్ చేశారని ఫైర్‌ అయ్యారు. అమరావతిని అవినీతి రాజధానిగా చేశారని దుయ్యబట్టారు. ఫ్రాడ్ బిల్లులతో దోచుకుని అడ్డంగా దొరికి పోయారని అన్నారు. సీఆర్‌డీఏ అంటే చంద్రబాబు రియల్ దోపిడీ అథారిటీ అని ఎద్దేవా చేశారు.

ప్రశ్నిస్తా అంటూ చెప్పే పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బీజేపీ అంటే ఏపీలో బాబు జనతా పార్టీగా మారిందని.. పురంధశ్వరి ఎందుకు మరిది గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సింగపూర్‌లో దోచుకున్న మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారన్న రోజా.. త్వరలో అమరావతి అవినీతి కేసులో చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.

ఇండియాను భారత్ అనే పేరుగా మార్చడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు. బుధవారం ఉదయం తిరుమలలో స్వామి వారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఏపి ప్రజలందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాని భారత్ అనే పదం మార్చడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని, మాతృ భాషలో పిలవడం మంచిదేనని అన్నారు.భారత్‌ పేరుకు తన వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top