Minister RK Roja Serious Comments on Nara Lokesh - Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌ రాజకీయాల్లోకి వచ్చాకే టీడీపీ నాశనమైంది: మంత్రి రోజా ఫైర్‌

Feb 14 2023 7:07 PM | Updated on Feb 14 2023 7:39 PM

Minister RK Roja Serious Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి రోజా ఫైరయ్యారు. చంద్రబాబు, లోకేష్‌ టూరిస్టుల్లా వచ్చి రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నందమూరి తారకరత్న గుండెపోటుతో సీరియస్‌ కండీషన్‌లో ఉంటే కనీసం పట్టించుకోని వ్యక్తి లోకేష్ అంటూ మండిపడ్డారు. 

కాగా, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పుత్తూరు సభలో లోకేష్‌ సభకు జనం రాలేదు. కర్నాటక, తమిళనాడు నుంచి తెప్పించి మీటింగ్‌ పెట్టారు. జనం రాలేదని ఒక రోజంతా ఎదురు చూశారు. నా గురించి తప్పుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని నారా లోకేష్‌ దుర్భాషలాడుతున్నారు. సీఎం జగన్‌ పులి అయితే.. లోకేష్‌ పులకేశి. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మేనిఫెస్టోను పవిత్రగ్రంధంలా భావిస్తున్న వ్యక్తి సీఎం జగన్‌. 

మా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే పళ్లు రాలగొడతాను. మీరే ఎర్ర చందనం దొంగలు. హెరిటేజ్‌ వాహనాల్లో ఎర్రచందనం ఎలా తరలించారో అందరికీ తెలుసు. నేను కష్టపడి షూటింగులు చేసి డబ్బు సంపాదించుకున్నాను. చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి చేశారో టీడీపీ నేతలు చెప్పగలరా?. టీడీపీ కోసం పనిచేసిన వారిని సైతం గాలికి వదిలేసిన చరిత్ర లోకేష్‌ ఫ్యామిలీది. పాదయాత్రకు జనం రానుందువల్లే లోకేష్‌.. ఫ్రస్టేషన్‌ పెరిగింది. అందుకే బూతులు మాట్లాడుతున్నాడు. నారా లోకేష్‌ రాజకీయాల్లోకి వచ్చాకే టీడీపీ నాశనమైంది. హైదరాబాద్‌, కుప్పంలో ఎన్నికల ప్రచారంలోకి వెళ్లే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కౌంటర్‌ ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement