నారా లోకేష్‌ వ్యాఖ్యలకు మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్‌

Minister Gudivada Amarnath Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నారా లోకేష్‌ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ, పర్రిశమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఆయన సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పప్పు లోకేష్‌కు పప్పును కానుకగా పంపుతున్నాను. కొంచెం ఉప్పు కారం కూడా వేశాను. సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. నేను లోకేష్‌లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ ను కాదు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యాను. అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా? 420 గాళ్లను పక్కన పెట్టుకొని 420 గాడిలా లోకేష్ మాట్లాడారు. మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమీ పికలేకపోయారు. నువ్వేమీ పికుతావు లోకేష్’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.

సారాయి, గంజాయి తాగిన వాళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. వీరప్పన్ లు, స్మగ్లర్లు లోకేష్ వెంట ఉన్నారు. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్దం. అయ్యన్న గంజాయి డాన్ అని గంటా ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమీ చెప్పారో గుర్తుకు తెచ్చుకో.. గతంలో మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకో. బంధుత్వాలు గురించి మాట్లాడడానికి లోకేష్‌కు సిగ్గు లేదా?’’ అంటూ మంత్రి అమర్‌నాథ్ నిప్పులు చెరిగారు.

లోకేష్, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశాము. రెడ్ బుక్‌లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్‌కు రాదు. ఎర్ర బుక్‌ను మడత పెట్టీ ఎక్కడ పెట్టుకుంటారో లోకేష్ ఇష్టం’’ అంటూ మంత్రి అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: దిగజారుడుతనానికి కేరాఫ్‌ చంద్రబాబే

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top