దాడి వీడియోలున్నా పోలీసుల నుంచి స్పందన లేదు: మార్గాని భరత్‌ | Margani Bharat Serious Comments On YSRCP Social Media Activists Arrests, More Details Inside | Sakshi
Sakshi News home page

దాడి వీడియోలున్నా పోలీసుల నుంచి స్పందన లేదు: మార్గాని భరత్‌

Nov 11 2024 12:05 PM | Updated on Nov 11 2024 12:47 PM

margani bharat serious on ysrcp social media activists arrests

తూర్పుగోదావరి, సాక్షి: తూర్పుగోదావరి జిల్లా సీతంపేట మూలగొయ్యి గ్రామనికి చెందిన యువకుడుపై దాడి జరిగిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. దాడికి సంబంధించిన ప్రత్యక్ష వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. అయినా పోలీసుల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారాయన. సోమవారం మార్గాని భరత్‌  మీడియాతో మాట్లాడారు.

‘‘మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనలో ఉన్నట్టుంది. కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల గళాన్ని వినిపిస్తాం. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాపై దాడులు చేయటం.. ప్రజాస్వామ్యానికి విఘాతం. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి.. ఏ కోర్టులో హాజరు పరుస్తున్నారో కూడా తెలియటం లేదు’’ అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement