BJP Manifesto: లోక్‌సభ ఎన్నికలు.. రేపే బీజేపీ మేనిఫెస్టో | Lok Sabha elections 2024: Bjp To Release Election Manifesto On April 14 | Sakshi
Sakshi News home page

BJP Manifesto: లోక్‌సభ ఎన్నికలు.. రేపే బీజేపీ మేనిఫెస్టో

Apr 13 2024 4:14 PM | Updated on Apr 13 2024 4:31 PM

Lok Sabha elections 2024: Bjp To Release Election Manifesto On April 14 - Sakshi

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది.

సాక్షి, ఢిల్లీ: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది. రేపు(ఏప్రిల్ 14)న బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. భారత్ సంకల్ప పత్రం పేరుతో పేరుతో మేనిఫెస్టోను విడుదల చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అంటూ  ప్రజల్లోకి కమల నాథులు వెళ్తున్నారు.

'మోదీ గ్యారెంటీ: 2047 నాటికి వికసిత్ భారత్' థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. సంకల్పపత్రం కోసం బీజేపీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపు 15 లక్షల సూచనలు రాగా, ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన కమిటీ.. మేనిఫెస్టోను రూపొందించింది.

ఇదీ చదవండి:కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. మహిళలకు లక్ష రూపాయలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement