టీడీపీని చంద్రబాబు హీన స్థితికి తెచ్చాడు: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi Serious Comments On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు: మహానుభావుడు సీనియర్‌ ఎన్టీఆర్‌ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నేడు, చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, కేసుల భయంతో చంద్రబాబు బీజేపీలో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని విమర్శించారు. 

కాగా, లక్ష్మీపార్వతి శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవాలని 25 సార్లు బ్రతిమిలాడుకుంటే ఒక మీడియేటర్‌ ద్వారా వారిని కలిశారనే ప్రచారం జరుగుతోంది. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సీనియర్‌ ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. నేడు చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితి తీసుకువచ్చాడు. ఎంతో మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు ఆయనను బహిష్కరించారు. 

కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడు. బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడు. అవసరమైతే టీడీపీని పూర్తిగా తీసేసుకుని కేసుల నుంచి బయటపడేమయని పెద్దల్ని వేడుకుంటున్నాడు. 

నారా లోకేష్‌ ఓ పనికిమాలిన వ్యక్తి. లోకేష్‌ను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబును ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో ఆయన సభలను చూస్తే అర్థమవుతుంది. పచ్చ మీడియా కూడా లోకేష్ మాదిరిగానే మారింది. లోకేష్ చెప్పినట్టు 200 సీట్లు వస్తాయని బాకా ఊదుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top