జగన్‌ ప్రభంజనాన్ని ఆపలేరు

Kurasala Kannababu Comments On First Phase Panchayat Elections Results - Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

కాకినాడ రూరల్‌: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఎన్ని కుయుక్తులు చేసినా.. చంద్రబాబు ఎన్ని రకాలుగా అడ్డుతగిలినా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేటలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి విజయ పరంపర కొనసాగిందని, ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ స్వగ్రామంలోనూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు విజయం సాధించారన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు భయపడే పార్టీ కాదని, ఈవేళ వాతావరణం అనుకూలంగా లేదని, ఆరోగ్య పరిస్థితులు కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. కాకినాడ రూరల్‌ సొంత నియోజకవర్గంలో 35 పంచాయతీలకు 33లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకార గ్రామం సూర్యారావుపేట సర్పంచ్‌ సూరాడ చిన్ని, గ్రామస్తులు కోణం, పండుగప్ప చేపలను విజయ సూచకంగా తీసుకురావడంతో వాటిని మంత్రి కన్నబాబు పట్టుకుని చూపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top