
హైదరాబాద్, సాక్షి: జన్వాడ ఫామ్‌హౌజ్ వ్యవహారం కోర్టుకి ఎక్కిన వేళ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆ ఫామ్ హౌజ్ తనది కాదని, నిబంధనలకు విరుద్ధంగా అది కట్టి ఉంటే తాను కూల్చివేయిస్తానని అన్నారాయన. ఈ క్రమంలో కాంగ్రెస్ మంత్రులపైనా ఆయన విమర్శలు సంధించారు.
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నా పేరుతో ఏ ఫాంహౌజ్ లేదు. నా ఫ్రెండ్ ఫాంహౌజ్ లీజ్‌కు మాత్రమే తీసుకున్నా. ఫాంహౌజ్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే నేనే కూలగొట్టిస్తా. నాకు కాదు.. కాంగ్రెస్ బడా నేతలకే ఫాంహౌజ్‌లు ఉన్నాయి. పొంగులేటి, మహేందర్‌రెడ్డి, మధుయాష్కీలకే ఎఫ్‌టీఎల్‌లో ఫాంహౌజ్‌లు ఉన్నాయి. రేవంత్ ఫాంహౌజ్ ఎక్కడుందో కూడా చూపిస్తా. హైడ్రానో.. అమీబానో తీసుకుని పోదాం అని మండిపడ్డారాయన.
.. పొంగులేటి తమ్ముడు కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నారు. వివేక్ ఫాంహౌజ్‌ను ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎలా కట్టారు?. మంత్రుల ఫాంహౌజ్‌లతోనే కూల్చివేతలు ప్రారంభించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారాయన.