
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతల తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. తప్పు అని చెప్తారా? అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మహేష్ కుమార్ గౌడ్ గారు.. మీ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయ యాత్రలు చేస్తుంటారు. మీ కాంగ్రెస్ నాయకులు మాత్రం న్యాయాన్ని, కోర్టులను, తీర్పులనూ అపహాస్యం చేస్తుంటారు. మీకు అనుకూలం కాకుంటే అది నిజం కాదు! మీకు నచ్చకపోతే అది న్యాయం కాదు?. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే తప్పు అని చెప్తారా?. కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా?’ అంటూ ప్రశ్నించారు.
Absolutely appalled by the comments of TPCC president Mahesh Kumar Goud garu on the Honourable Supreme court’s dismissal of Special Leave Petition (SLP) in Palamuru-Rangareddy Lift Irrigation Scheme project
It is not just demeaning to the Supreme Court but the constitution of…— KTR (@KTRBRS) May 23, 2025