
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎంతో ఆసక్తికర ఫీడ్‌బ్యాక్, ఎన్నో ఇంట్రస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయని తెలిపారు. వాటిలో నుంచి ఒక కామెంట్‌ను ఆయన ఆదివారం(డిసెంబర్ 31) ఉదయం తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పంచుకున్నారు.
కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు 32 యూ ట్యూబ్ చానళ్లు పెట్టి ఉండాల్సిందన్న అభిప్రాయం తనకు బాగా నచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఈ అభిప్రాయంతో తాను కొంత వరకు ఏకీభవిస్తున్నానని కూడా ఆయన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఇటీవల స్వేదపత్రం విడుదల చేసే సందర్భంగా కూడా బీఆర్‌ఎస్ ఓటమిపై కేటీఆర్ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ముఖ్యంగా యూ ట్యూబ్‌లో ప్రత్యర్థుల ఫేక్ ప్రొపగాండాను తిప్పికొట్టడంలో తాము విఫలం అయినట్లు ఒప్పుకున్నారు.
ఇదీచదవండి..అయోధ్య రామ మందిర వేడుకలు..కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు