బాబుకు అది వెన్నతో పెట్టిన విద్య: కొడాలి నాని | Kodali Nani Slams Chandrababu Naidu Over Comments On Religion and Caste | Sakshi
Sakshi News home page

‘ఓర్వలేకే ప్రతిపక్షాలు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి’

Jan 6 2021 1:35 PM | Updated on Jan 6 2021 2:11 PM

Kodali Nani Slams Chandrababu Naidu Over Comments On Religion and Caste - Sakshi

సాక్షి, విజయవాడ: అధికారం కోసం ఎంతకైనా దిగజారే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు మనిషే కాదని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో జరిగిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. వాడుకోవడం వదిలేయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. 74ఏళ్ల వయసు, ఇంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన కులాలు, మాతాల గురించి మాట్లాడటం బాబు దిగజారుడుతనానికి నిదర్శమని దుయ్యబట్టారు. సీఎం, మంత్రి, డీజీపీ, ఎస్‌పీలు క్రిస్టియన్‌లు అంటూ మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. అధికారులు మతాల కోసం​ పనిచేయరని, అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి నీచుల కోసమే అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతలు తీసుకునేటప్పుడు కుల మత రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని పెద్దలు వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. 

రాష్ట్రంలోని హిందూ, క్రిస్టియన్, ముస్లిం, అన్ని వర్గాలు ఆదరించడం వల్లే చంద్రబాబు ఈ స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఉచ్చం, నీచం లేకుండా రాష్ట్రంలో మతాల, కులాల మధ్య చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీచ రాజకీయాలను చూస్తున్న ప్రజలు అతన్నీ భూస్థాపితం చేయాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మిడత లాంటి లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ అంటే ఒక వ్యవస్థ అని, వైఎస్సార్‌ ఆశీస్సులతో ఆయన చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement