లోకేశ్‌ పాదయాత్రతో లాభం లేదు: జేసీ  | JC diwakar Reddy about Nara Lokesh Padayatra | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ పాదయాత్రతో లాభం లేదు: జేసీ 

Feb 9 2023 1:21 AM | Updated on Feb 9 2023 2:07 AM

JC diwakar Reddy about Nara Lokesh Padayatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేత నారా లోకేశ్‌ పాదయాత్రతో లాభం లేదని, ఆయనతో సహా రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసినా, ఎవరు చేసినా లాభం లేదని ఏపీకి చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాదయాత్రలకు కాలం చెల్లిందని, జనాలు పట్టించుకోవడం లేదని చెప్పారు.

బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏపీకి చెందిన మాజీ మంత్రి శైలజానాథ్‌ ఉన్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించిన జేసీ.. ఆ తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గతంలో పాదయాత్రలు వేరని, ఇప్పుడు వేరని, ఇప్పుడు అన్నీ డబ్బుతో కూడుకున్న యాత్రలేనని ఈ సందర్భంగా దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement