
సాక్షి, తెలంగాణ భవన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కరువు తెచ్చిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, హరీష్‌రావు శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయ్యింది. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని విఫలమయ్యారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పింది. అసెంబ్లీ రూపురేఖలు మారుస్తామని తట్ట మట్టి కూడా ఎత్తలేదు. రైతు రుణమాఫీపై అతీగతీ లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు. ఉన్న పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు.
రాష్ట్రంలో కరువును పెంచడానికి కాంగ్రెస్ పోటీ పడుతోంది. వ్యవసాయాన్ని శిథిలావస్థకు చేర్చుతున్నారు. సీఎం గారు పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వండి. తాగడానికి నీళ్ళు లేక జనం గోస గోస పడుతున్నారు మీ పాలన వచ్చింది ఖాళీ బిందెలు, నిండుగా వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. కర్ణాటక నుంచి తాగునీరైన తెప్పించడంలో విఫమయ్యారు. ప్రాజెక్ట్‌లు అప్పగింత చేసి మేము ఒత్తిడి తేవడంతో మళ్లీ వెనక్కి తగ్గారు.
కేసీఆర్.. కిట్లు ఇస్తు.. రేవంత్ మాత్రం తిట్లతో పోటీ పడుతున్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నారు. ఇదీ కాంగ్రెస్ ఘనత. కరువును పెంచడానికి పోటీ పడుతుంది కాంగ్రెస్. కాంగ్రెస్ వంద రోజుల పాలన లో 174మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 34మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాం అన్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మొన్నటి బడే భాయ్ చోటే భాయ్ మీటింగ్‌లో తేలిపోయింది. కాంగ్రెస్ పాలన, యూట్యూబ్.. యూటర్న్ పాలనగా సాగుతోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.