హైదరాబాద్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర

Published Sat, May 25 2024 6:26 AM

Harish Rao Satirical Comments On Congress and BJP

యూటీ లేదా ఉమ్మడి రాజధాని చేసేందుకు యత్నాలు 

బోనస్‌ ఇవ్వమని అడిగితే రైతులు మొరుగుతున్నట్లా? 

జూలైలో రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం

పట్టభద్రుల ఎన్నికల సమావేశంలోమాజీ మంత్రి హరీశ్‌

సత్తుపల్లిలో మాట్లాడుతున్న హరీశ్‌రావు, పక్కన అభ్యర్థి రాకేశ్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్, బీజేపీలది రాజకీయం.. కానీ కేసీఆర్‌ది తెలంగాణతో పేగుబంధం. పోరాటాలు చేసి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. ఇవ్వాళ బీజేపీ కొత్త కుట్ర చేస్తోంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తరట.. హైదరాబాద్‌ లేని తెలంగాణ ఉంటదా.. తల లేని మొండెం అయిపోతాం మనం. బీజేపీ, కాంగ్రెస్‌ వాళ్లు కలిసి హైదరాబాద్‌ను యూటీ చేయాలని లేదా మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలని కుట్రలకు తెరతీస్తున్నారు.

తెలంగాణ కోసం పుట్టిన బీఆర్‌ఎస్‌ను కాపాడుకునే బాధ్యత మీపై ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోకుండా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించండి’అని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బోనకల్‌లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన మాట్లా డారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతుండగా, ఇప్ప టి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను మరో పదేళ్లు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రైతులను ఆ మంత్రి కుక్కలతో పోలుస్తారా? 
సత్తుపల్లిలో సమావేశం అనంతరం తల్లాడ మండలం నూతనకల్‌లో క్రాప్‌ హాలిడే ప్రకటించిన రైతులతో హరీశ్‌రావు మాట్లాడారు. వర్షాలు పడినా జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మి చెక్కులు రాలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సన్న ధాన్యంతోపాటు దొడ్డు ధాన్యానికి కూడా బోనస్‌ ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘వడ్లకు బోనస్‌ ఇవ్వమంటే ఇవన్నీ వ్యవసాయం తెలియని వారి మాటలని.. రైతులు మొరుగుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి అనడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయ శాఖ మంత్రి కుక్కలతో పోలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పట్టభద్రులు ఓటు వృథా చేసుకోవద్దు 
జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా విత్తనాలు అందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో మండల వ్యవసాయ శాఖా« దికారులతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడు తూ పట్టభద్రులు తమ ఓటును వృథా చేసుకోవద్దని కోరారు.

సమావేశంలో ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

టిమ్స్‌ ఆసుపత్రులపై కాంగ్రెస్‌ది రాజకీయం: హరీశ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించిన టిమ్స్‌ ఆసుపత్రులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఐదు నెలలుగా నిర్మాణ పనుల పర్యవేక్షణను గాలికి వదిలిన మంత్రి కోమటిరెడ్డి.. గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement