అందుకే ఆగాం, లేకుంటేనా.. : హరీష్‌రావు | Sakshi
Sakshi News home page

వంద రోజులు కాలేదని ఆగాం.. లేకుంటే చీల్చి చెండాడే వాళ్లం: హరీష్‌రావు

Published Wed, Jan 17 2024 1:57 PM

Harish Rao Fire on Congress Govt At BRS Party Nagarkurnool Meet - Sakshi

హైదరాబాద్‌, సాక్షి:  తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడినా.. అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. ఆయన కాంగ్రెస్‌ సర్కార్‌పై సెటైర్లు సంధించారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు. ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతోంది. కరీంనగర్ కు ఒక్క రూపాయి తెనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారాయన. ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చెప్పారు. 


దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ  అని ప్రతిపక్షం లో ఉండగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు, ఇప్పుడేమంటారు?..  దావోస్కు వెళ్లిన సీఎం బృందం  రాష్ట్రం అప్పుల్లో ఉంది.. పెట్టుబడులకు రావొద్దు అని చెప్పదలుచుకుందా? అని నిలదీశారాయన. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలు మొదలుపెడుతోందని మండిపడ్డారు.  
ఇంకా వంద రోజులు కాలేదు  కదా అని ఆగుతున్నాం. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  చీల్చి చెండాడే వాళ్లం అని మండిపడ్డారాయన. కొన్ని రోజులు పోయాక ఇంట్లో కూర్చున్న బీఆర్ఎస్ నేతల్ని ప్రజలే బయటకు తీసుకువస్తారని హరీష్‌రావు అన్నారు.

Advertisement
 
Advertisement