TG: కిషన్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి | Former Minister Mallareddy Meeting With Kishanreddy | Sakshi
Sakshi News home page

TG: కిషన్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Oct 10 2024 3:18 PM | Updated on Oct 10 2024 4:22 PM

Former Minister Mallareddy Meeting With Kishanreddy

సాక్షి,హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం(అక్టోబర్‌10) తెలంగాణ బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. తన అల్లుడు, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. తన మనవరాలి పెళ్లికి రావాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు. వివాహపత్రికను కిషన్‌రెడ్డికి అందించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.

మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే కిషన్‌రెడ్డిని కలిశానని, రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. చంద్రబాబునాయుడు రాజకీయ భిక్ష పెట్టడం వల్లే గతంలో ఎంపీ అయ్యానన్నారు. టీడీపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు మాత్రం మల్లారెడ్డి సమాధానం దాటవేశారు.

కాగా, ఇటీవలే మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి రావాల్సిందిగా ఏపీ సీం చంద్రబాబునాయుడును కలిసి ఆహ్వానించారు. బాబును కలిసిన తర్వాత మల్లారెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే పెళ్లికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిశానని మల్లారెడ్డి ఆ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. 

ఇదీ చదవండి: మార్కెటింగ్‌లో సీఎం రేవంత్‌ నెంబర్‌వన్‌ 
 

Advertisement
 
Advertisement
Advertisement