సాక్షి, హైదరాబాద్: అజారుద్దీన్‌కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్రలు చేస్తోందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికల కమిషన్‌కు బీజేపీ నేతలు లేఖ రాశారని.. జూబ్లీహిల్స్ బయట ఎన్నికల కోడ్ లేదన్నారు. తెలంగాణకు, హైదరాబాద్‌కు గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్. ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద బీజేపీకి ప్రేమ లేదు. ఈ దేశానికి పేరు తెచ్చిన అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి... వద్దని బీజేపీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది’’ అని భట్టి మండిపడ్డారు.
‘‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ సరెండర్ అయింది. బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుంది. బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చే పనిలో భాగంగానే అజారుద్దీన్‌పై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రమాణ స్వీకారం జరగకుండా ఉండేందుకు గవర్నర్‌పై బీజేపీ ఒత్తిడి తెస్తుంది. జూబ్లీహిల్స్ బయట ఎన్నికల కోడ్ లేదు. కరగ్‌పూర్ నియోజకవర్గంలో పోలింగ్‌కు ముందు అభ్యర్థిని మంత్రిగా బీజేపీ ప్రకటించింది. అజారుద్దీన్ ఇక్కడ అభ్యర్థి కూడా కాదు.. అయినా అభ్యంతరం ఎందుకు?’’ అంటూ భట్టి విక్రమార్క ప్రశ్నించారు.


