కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ ఖాళీ: దానం | Danam Nagender Comments On BRS MLAs Party Shift To Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ ఖాళీ: దానం

Jun 21 2024 12:46 PM | Updated on Jun 21 2024 1:24 PM

Danam Nagender Comments On BRS MLAs Party Shift To Congress

సాక్షి, హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా  ఉన్నార‌ని అన్నారు ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌. త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. కేసీఆర్ విధానాలే బీఆ ఎస్‌ను ముంచాయ‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు గాంధీభ‌వ‌న్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ..  పోచారం శ్రీనివాస్ రెడ్డే కాదు.. చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు.  

గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక కూడాఉంటుందని తెలిపారు.

మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు దానం నాగేంద‌ర్‌. చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చించార‌ని పేర్కొన్నారు. పల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి , హరీష్ రావు, కేటీఆర్‌లు తప్పా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతార‌ని జోస్యం చెప్పారు. అయితే హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నార‌ని, అందుకే బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని విమ‌ర్శించారు.

కాగా మాజీ స్పీక‌ర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు విష‌యం తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ల‌డ‌మే కార‌ణం. పోచారం ఇంటికి వెళ్లిన సీఎం.. ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇత‌ర నేత‌లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement