తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్‌.. బీఆర్‌ఎస్‌ టచ్‌లోకి మరో ఎమ్మెల్యే | Congress Party Mla Tellam Venkata Rao Meets To Brs Mla Prasanth Reddy | Sakshi
Sakshi News home page

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్‌.. బీఆర్‌ఎస్‌ టచ్‌లోకి మరో ఎమ్మెల్యే

Jul 30 2024 3:58 PM | Updated on Jul 30 2024 4:38 PM

Congress Party Mla Tellam Venkata Rao Meets To Brs Mla Prasanth Reddy

సాక్షి,హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎమ్మెల్యే షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 

ఇందులో భాగంగా ప్రతిపక్షనేత, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఛాంబర్‌కి వెళ్లారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేక్, మల్లారెడ్డిలు ఉన్నారు. కేసీఆర్‌ ఛాంబర్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అనంతరం తెల్లం వెంకటరావు, ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డిలు కలిసి బయటకు వెళ్లడంతో..తెల్లం వెంకట్రావు సైతం తిరిగి బీఆర్‌ఎస్‌ చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

జులై మొదటి వారంలో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కష్ణమోహన్‌ రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎల్‌వోపీలో బీఆర్‌ఎస్‌​ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం. సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి మళ్లీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డితో భేటీ అవ్వడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement