మేడిగడ్డ కట్టాలన్నదే కేసీఆర్‌ ఆలోచన: సీఎం రేవంత్‌ ఫైర్‌

CM Revanth Reddy Serious Comments Over BRS Party In Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబీలో ఇరిగేషన్‌ శాఖపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్‌, హరీష్‌ రావు కలిసి ప్రాజెక్ట్‌ల పేరుతో దోచుకున్నారని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, సభలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. గోదావరి జలాల వినియోగంపై అధికారులు పూర్తి నివేదిక ఇచ్చారు. రిటైర్డ్‌ ఇంజినీర్లు ఇచ్చిన నివేదికలోని అంశాలను సభ ముందు ఉంచుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. 

 • కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారమని అప్పుడే నిపుణులు చెప్పారు. 
 • మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్‌ నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది. 
 • 14 పేజీలతో రిటైర్డ్‌ ఇంజినీర్లు ఈ నివేదిక ఇచ్చారు. 
 • కేసీఆర్‌ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది. 
 • మేడిగడ్డ కట్టాలన్నదే కేసీఆర్‌ ఆలోచన. 
 • మేడిగడ్డ వద్దే ప్రాజెక్ట్‌లు కట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. 
 • నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారు. 

 • కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెలంగాణ ప్రజానీకానికి కళంకంగా మారింది. 
 • దోచుకోవాలని దాచుకోవాలనే ఆలోచనతోనే మేడిగడ్డ కట్టారు 
 • కూలిన ప్రాజెక్ట్‌ను చూసి మీరు సిగ్గుపడాలి. 
 • ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తుంది. 
 • తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది కూడా మేమే. తప్పులు ఒప్పుకోండి.. కప్పిపుచ్చుకోండి. 
 • ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఆటంకాలు తొలగించడానికి బోర్డు, కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. 

 • హరీష్‌రావు, వాళ్ల మామ కేసీఆర్‌ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. 
 • వాళ్లు నియమించుకున్న ఇంజినీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు. 
 • తుమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్ట్‌ కట్టాలని నివేదిక ఇప్పించుకున్నారు. 
 • మేడిగడ్డ మేడిపండేనా సాక్షిలో కథనం కూడా వచ్చింది. 

 • ప్రజలు నమ్మి పదేళ్లు అధికారం ఇస్తే తెలంగాణను నిండా ముంచారు. 
 • కాళేశ్వరంతో చేవేల్లకు అన్యాయం చేశారని ఆనాడు సబితా ఇంద్రారెడ్డి ధర్నా చేశారు. 
 • నేడు ఇదే సభలో హరీష్‌ అబద్దాలు చెబుతుంటే ఏం మాట్లాడకుండా సెలైంట్‌గా చూస్తున్నారు. 
 • ప్రాజెక్ట్‌లకు సాగు నీటి మంత్రిగా కొనసాగి.. ఆ తరువాత హరీష్‌ను ఎందుకు బర్తరఫ్‌ చేశారు. 
 • విచారణకు వెళ్లి ఇప్పటికైనా తప్పును ఒప్పుకోండి అంటూ విమర్శలు చేశారు. 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top