కేసీఆర్‌కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా? 

BRS MLA Peddi Sudarshan Reddy Comments On YSRTP YS Sharmila - Sakshi

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి   

నర్సంపేట: ‘చెప్పుల దుకాణం యజమానిలా మాట్లాడుతున్నావు, కేసీఆర్‌కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా?’అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఉద్దేశించి అన్నారు. గురువారం ఆయన వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్‌ను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

నోటి దురుసు తగ్గించుకోవాలని హితవుపలికారు. వైఎస్‌.రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర చేశారని, కానీ ఇలా చిల్లర మాటలు ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. నిరాధారమైన, అసత్యమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌ కుటుంబంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top