బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరింది వీరే.. | Brs Leaders Joins Congress Party Just Before Parliament Elections | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ వలసలు

Feb 16 2024 4:50 PM | Updated on Feb 16 2024 9:21 PM

Brs Leaders Joins Congress Party Just  Before Parliament Elections - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డితో  కలిసి కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ అయ్యారు.

వీరితో పాటు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఆయన సతీమణి చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మున్షీ వీరికి హస్తం కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.   

ఇదీ చదవండి.. ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి.. అక్బరుద్దీన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement