
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా..
ఎనకటికి ఎవడో ఏదీ అడగకుంటే .. సచ్చిందాక సాకుతా అన్నాడట.
ఏస్తున్న రైతు భరోసా సరే మరి.. ఎగ్గొట్టిన రైతుభరోసా సంగతి ఏంది?.
ఎగ్గొట్టిన వడ్ల బోనస్ సంగతి ఏంది?
ఎగ్గొట్టిన తులం బంగారం, కళ్యాణలక్ష్మి పరిస్థితి ఏంటి?
ఎగ్గొట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పరిస్థితి ఏంటి?
ఎగ్గొట్టిన రూ.2500 మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏంటి?
ఆడబిడ్డలకు ఎలక్ట్రిక్ స్కూటీల పరిస్థితి ఏంటి?
ఆగిపోయిన రైతుబీమా పరిస్థితి ఏంటి?
ఆగిపోయిన రుణమాఫీ పరిస్థితి ఏంటి?
శాసనసభ ఎన్నికల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి
లోక్ సభ ఎన్నికల కోసం దేవుళ్ల మీద ఒట్లేసి
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతుభరోసా పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలను తెలంగాణ గమనిస్తుంది.
మీ పదవుల గ్యారంటీ కోసం ఉన్న శ్రద్ద - తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన గ్యారంటీ కార్డు అమలుపై లేకపాయే అని కామెంట్స్ చేశారు.