కాంగ్రెస్‌ హామీ స్వాగతించదగినది, కానీ..: కేటీఆర్‌ కామెంట్స్‌ | BRS KTR Interesting Comments Over Congress Manifesto | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హామీ స్వాగతించదగినది, కానీ..: కేటీఆర్‌ కామెంట్స్‌

Apr 6 2024 11:07 AM | Updated on Apr 6 2024 12:56 PM

BRS KTR Interesting Comments Over Congress Manifesto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జంపింగ్‌ నేతలు పార్టీలు మారుతుండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక, కొన్ని పార్టీలు కూడా జంపింగ్‌ నేతలకే టికెట్‌ ఇవ్వడంతో పొలిటికల్‌గా అసలు కథ మొదలైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. కానీ, ఇప్పుడు మేనిఫెస్టో ద్వారా ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని తెలిపారు. 

పదో షెడ్యూల్‌ చట్ట సవరణ స్వాగతించదగినది. కానీ, కాంగ్రెస్‌ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా వారి విధానాలు ఉంటాయి. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఆ పార్టీ చేర్చుకుంది. అందులో ఒక ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. హామీలపై నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్‌ గాంధీ మాట్లాడాలి. వారి పార్టీలో చేరిన ఇద్దరితో రాజీనామా చేయించాలి. అనర్హులని స్పీకర్‌ ప్రకటించాలి. చెప్పిందే చేస్తాం.. అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్‌ నిరూపించుకోవాలి అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement